కడప నగరంలోని చిన్నచౌక్ ఏరియాలో జరిగిన గొలుసు దొంగతనానికి సంబంధించి ముద్దాయి కిశోర్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ నగర్‌కు చెందిన ఈ దొంగను, 04.09.2025న తాడిపత్రి-తిరుపతి బైపాస్ రోడ్డులోని దేవుని కడప ఆర్చి వద్ద అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 16.5 గ్రాములు బరువు గల రూ.1,00,000/- విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి A. వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో, చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ G. ఓబులేసు మరియు SIs P. రవికుమార్, N. రాజరాజేశ్వర రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ఛేదించింది.కేసు ఛేది