ఏలూరు జిల్లా ఏలూరు తమ్మిలేరులో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను మున్సిపల్ అధికారులు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలగించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో తమ్మిలేరు ప్రాంతంలో గుర్రపు డెక్క అడ్డు రావడంతో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గుర్రపు డెక్కన్ తొలగించారు తమ్మిలేరు పరిసర ప్రాంతాలలో వరద ఉధృతి కి గుర్రపు డెక్క అడ్డు ఉంటే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సమీప ప్రజలను కోరారు