బద్వేలు మండలం చెన్నంపల్లె మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అధునాతన వసతులతో పునర్నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బద్వేలు మండలం చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణంపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బద్వేలు మండలం చెన్నంపల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గదులను కోల్పోవడం జరిగిందన్నారు.