నిత్యం వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డులో ఎటువంటి భద్రత లోపం సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు SSG ఎస్పీ భద్రయ్య ఆదివారం సాయంత్రం తుళ్లూరు సీడ్ యాక్సెస్ రోడ్డులో భద్రత చర్యలపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టాలి అనే అంశంపై ఆధునిక సాంకేతిక భద్రత పరికరాలతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు.