మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఉపాధి కోల్పోతున్నామంటూ సోమవారం రంపచోడవరంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో యూనియన్ సభ్యులు రంపచోడవరంలో భారీ ర్యాలీ చేసి, ఐటీడీఏ పిఓ కట్ట సింహాచలం కి వినతిపత్రం అందించారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.