ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ఉపాధి కల్పించాలని ఇతర డిమాండ్ల సాధనకై గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుండి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఏ ఐ టియు సి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీ అమలు చేయడానికి రెండేళ్లు పట్టింది నీ నిన్న ముఖ్యమంత్రి అనంతపురం సభలో డ్రైవర్లకు 15000 ఇస్తున్నట్టు ప్రకటిస్తూ ఈ పథకం పొందాలంటే ప్రతి డ్రైవర్ కి బ్యాడ్జి ఉండాలని తదితర సరతలు పెట్టడం దారుణమని అన్నారు