ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి ప్రతిమలను కాక మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడదామని చిన్నారి గొంప సాహితి పిలుపునిచ్చింది. చిన్నతనంలోనే పర్యావరణ పరిరక్షణ పై మక్కువ పెంచుకోవడం చాలా గొప్ప విషయం. ఒకపక్క చిన్నారి సాహితి పర్యావరణ పరిరక్షణ పై పోరాడుతూ ఉంటే మరోపక్క కోటిలింగాలతో భారీ గణనాథుడంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన శివలింగాలను వాడడం దానిని జిల్లా కలెక్టర్ సిపీ తోపాటు ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ సిబ్బంది, కూడా మద్దతుగా నిలిస్తే ఇక పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందని మన ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా ఏ విధంగా మారుతుందని సాహితీ ప్రశ్నించింది.