రెండు రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో తలారి లోకేంద్ర అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ శనివారం విలేకరుల సమక్షంలో చూపించారు. వీరి నుంచి రెండు వేట కొడవల్లు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వేట కొడవల్లు ధర్మవరం సంతలో కొన్నట్లు నిందితులు చెప్పారని గతంలో తన తండ్రి హత్యకు ప్రతీకారంగానే బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి లోకేంద్రను చంపినట్లు తెలిపారు.