Download Now Banner

This browser does not support the video element.

జీలుగుమిల్లి లక్ష్మీపురం జాతీయరహదారిపై పాఠశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం, లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం

Eluru Urban, Eluru | Sep 2, 2025
జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పిల్లలను ఎక్కించుకోవడానికి ఆగి ఉన్న ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us