మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన “అప్పుడే బాగుండే” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..... పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహనికి పాలాభిషేకం చేసి నల్లకండువాలు ధరించి అంబేద్కర్ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు..మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొని ఉత్సాహం ప్రదర్శించారు