రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల CPM పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, మండల కార్యదర్శి రమేష్ చంద్ర మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన గొప్ప పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మని అన్నారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత అని కొనియాడారు. భూమికోస, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం వ్యతిరేకంగా భూస్వాములు, దొరలకు ఎదురొడ్డి పోరాడిన ఘనత ఆమెకే దక్కిందని అన్నారు. నిజాం నిరంకుశ ప