ధర్మవరం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వర్గీయ పరిటాల రవీంద్ర 67వ జయంతి కార్యక్రమం వేడుకలు నిర్వహించారు. పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పరిసె సుధాకర్ మండల నాయకులు మహేష్ చౌదరి సీనియర్ నాయకులు కాటమయ్య ధర్మవరం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు సైతం హాజరయ్యారు.