వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ గురవయ్య కోరారు. గురువారం ఆయన పెనుమూరు సబ్ స్టేషన్, సెక్షన్ ఆఫీసును తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, విద్యుత్ సరఫరా వివరాలపై ఆరా తీశారు. వినియోగదారులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.