అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ వద్ద సోమవారంఐదు గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వచ్చే వాహనాలకు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 10న కక్కలపల్లి గ్రామ సమీపంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారని ఆ సభకు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రసన్నయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.