నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు మునిసిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలోని రైల్వే అండర్ සර්ය, గౌతమ్ నగర్ బైపాస్, జునైరా హోటల్, బోధన్ రోడ్, న్యూ బ్రిడ్జి సమీపంలోని సాగర్ హిల్స్ వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆకస్మాత్తుగా కురిసే భారీ వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి జాగ్రత్త తీసుకోవాలని మున్సిపల్ సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఉన్నారు.