ఏలూరు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ శ్రీ పర్రు గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కూలీలతో వెళ్తున్న ఆటోను మినీ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు.