రైతు రుణమాఫీ నిధుల విడుదలపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదిక నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను కలెక్టర్ వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నేడు పండుగ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు.రుణమాఫీ డబ్బులను పిల్లల విద్య కోసం సైతం ఖర్చు చేయాలని సూచించారు.