నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో నిఘా కొనసాగుతుందన్నారు. 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న వినాయకులను ఉమ్మెడ వైపు, తక్కువ ఎత్తు ఉన్న వాటిని బాసర బ్రిడ్జీ వైపు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బందోబస్తుకు, ఎక్సైజ్, NCC తోపాటుగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ బందోబస్తు నిర్వహించమన్నారు.