జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం దమ్మనపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్టు పోలీసులకు బాధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని గంగారెడ్డి వ్యవసాయ పనులకు వెళ్లగా మాటు వేసిన దొంగలు ఇంటి తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న బంగారం చోరీ చేసినట్టు శనివారం తెలిపారు. గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్కరు సిసి కెమెరాలు మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.