ఎస్సీ వర్గం పై దేశ వ్యాప్తంగా దాడులు జరిపేందుకు మోదీ కుట్ర పన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ అన్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రెస్లోక్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గాన్ని బలహీన పరిచేందుకు వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. దీనికి తెలుగు రాష్ట్రల సీఎంలు మద్దతిచ్చారన్నారు. వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.