సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్థానిక సంస్థల ఓటర్ పోలింగ్ కేంద్రాల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలైన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు డ్రాప్ట్ ఓవర్ జాబితా పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపిటిసి, 12 జెడ్పిటిసి స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని వీటి పరిధిలో 3 లక్షల 53వేల 351 ఓటర్లు ఉన్నార