నంగునూరు మండలంలో యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల రైతు వేదిక ముందు ఆదివారం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. క్యూ లైన్ చూస్తే చాలా మంది ఉన్నారని, కానీ బస్తాలు 400 మాత్రమే వచ్చాయని రైతులు వాపోయారు. యూరియా కొరత లేదని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంది కానీ క్షేత్ర స్థాయిలో రైతులు మాత్రం యూరియా కోసం పడి కాపులు కాస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా.. కాంగ్రెస్ నాయకులు కనబడతలేవా? రైతు వేదిక వద్దకు వచ్చి చూడండని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు పాలమాకుల గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉదయం మూడుగం