మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో సామాజిక పెన్షన్ల పంపిణీని గురువారం ఉదయం 7గంటలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. 6వ డివిజన్ చిలకలపూడిలో పెన్షన్ దారు కొమ్మోజు విజయలక్ష్మి ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమెకు రూ.4వేలు వితంతు పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 6గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించామన్నారు.