జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు అశ్వరావుపేట వద్ద చెన్నాపురం సమీపంలో వాగు దాటే సమయంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు గల్లంతు కావడంతో జీలుగుమిల్లి, అశ్వరావుపేట పోలీసులు, NDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు జీలుగుమిల్లి CI వెంకటేశ్వరరావు తెలిపారు.