అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో అయోధ్య బాలరాముడు అలంకరణలో బుధవారం ఏర్పాటు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. యాడికి లోని అమ్మవారి శాలలో 11 అడుగుల అయోధ్య బాలరాముడును ఏర్పాటు చేయడంతో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా యాడికిలో కరెన్సీ నోట్లు, చాక్లెట్ల దండలు, అర్ధరూపాయి దండలతో వినూత్నంగా చేసిన వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్నంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.