ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..ఇంద్రవెల్లి నుంచి ఉట్నూర్ కు వస్తున్న కారు అదువు తప్పి రోడ్డు పక్కనే వున్న చెట్టుకు ఢీకొంది.దీంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.ఘమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంవల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది., ప్రమాదానికి గల కారణాలు మరిన్ని తెలియాల్సి ఉంది.