ఎమ్మిగనూరులో శనివారం భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు కాలనీలలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు బైపాస్ రోడ్డులో ప్రధాన రహదారిపై గుంత ఏర్పడి వర్షపు నీరు నిలబడింది. గుంత లోతు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు.