గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మాణంలో ఉన్న అధికారుల భవనాలను ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 31 లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామని, రోడ్డు డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 1 నాటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు భవనాలు అందజేస్తామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని చెప్పారు. త్వరలోనే అన్ని టవర్స్ ను ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.