వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు దాటుతున్న మహిళను బైక్ ఢీకొన్న ఘటన ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో బైకు మునుకుంట్ల గౌరమ్మనే మహిళను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మామునూరు పోలీసులు.