అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలొ గల రావికమతం మండలం పాతకొట్నాబెల్లి నుంచి టీ.అర్జాపురం వరకు రోడ్డు పనులు మొదలు పెట్టాలని బుధవారం ఆదివాసీ గిరిజనులు బురదలో కూర్చోని వినూత్నంగా నిరసన తెలిపారు. గతంలో ఈ రోడ్డు పనులు మొదలు పెట్టి మధ్యలోనే వదిలేశారని, దీంతో తాము రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆసుపత్రికి వెళ్లాలన్న, సచివాలయానికి వెళ్లాలన్న ఇబ్బందులు తప్పడం లేదని, తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు.