నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కొరకు వచ్చిన రైతులపై స్థానిక ఎస్సై రాము చేయి చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా యూరియా కొరకు ఇబ్బందులు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ PACS కు ఇవాళ 600 బస్తాల యూరియా రావడంతో సుమారు 200 పైగా రైతులు వాటిని తీసుకోవడని వచ్చారు. ఒక్కసారి కార్యాలయం గేటు వద్దకు రావడంతో రైతులను అదుపు చేసే క్రమంలో అసహనానికి గురైన ఎస్సై రైతు పై చేయి చేసుకున్నాడు. యూరియా కొరకు వస్తె రైతులపై చేయి చేసుకోవడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.