నగరంలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ప్రకటించారు. ఉన్నతాధికారులతో జరిగిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల సమష్టి కృషి వల్లనే నేరాల సంఖ్య తగ్గిందని అభినందించారు. గతేడాదితో పోలిస్తే హత్యలు, కిడ్నాప్లు, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు వంటి కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించిందని తెలిపారు.