అనంతపురం నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలా మారిందన్నారు.ప్రత్యక్షంగా పోలీసులపై భౌతికదాడులకు చేస్తున్న పట్టించుకునే వారు లేరన్నారు.పోలీసులు కస్టపడి చదివి, మెరిట్ పోంది, కఠోర మైన శిక్షణ పొంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు.చంద్రబాబు బాబు జోబులోంచి తీసి పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.