భీమ్ గల్ మండలము గోనుగొప్పుల గ్రామం లో గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు బోదిరే స్వామి,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,డీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి భోజ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు సేపూర్ చరణ్ గౌడ్,సోసైటీ చైర్మన్ దేవెందర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపియ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.