అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ముందు చవితి ఉత్సవాల్లో భాగంగా బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముత్యాల వినాయకుడి ప్రతిమ భక్తులను గురువారం విశేషంగా ఆకట్టుకుంది. బంక మట్టితో పది అడుగుల ఎత్తు ఆరు అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ 40,000 ముత్యాల పూసలతో ఐదు మంది కళాకారులు 35 రోజులపాటు కష్టపడి తయారు చేశారు. మెరిసే ముత్యాలకు తోడు వెలుగులు తోడు అవడంతో వెలుగులు విరాజిమ్ముతున్న ముత్యాల వినాయకుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.