ధర్మవరం పట్టణం ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సత్యసాయి జిల్లా జనవిజ్ఞాన ద్వితీయ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జన విజ్ఞాన వేదిక కార్యకలాపాలు విస్తృత పరిచయం ప్రజల్లో మూఢనమ్మకాలపై అపోహలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మతాన్ని సామరస్య పూర్వక కార్యకలాపాలకు ఉపయోగించాలన్నారు. పాఠశాలల్లో కేవలం విద్యనే కాకుండా జ్ఞానాన్ని బోధించాలన్నారు.