అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అలాగే షాదీ ముబారక్ – కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు