జిల్లాలో ఉన్న రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. మరో విడతలో ఎరువులు గ్రామాల్లో ఉన్న రైతులకు ఎప్పుడు అందిస్తారో వ్యవసాయ అధికారులు ముందుగానే తెలియపరస్తారని అన్నారు. ఒక ఎకరాకు మూడు విడతల్లో యూరియా వినియోగించాలని తెలిపారు.