2 బైక్లు ఢీకొన్న ఘటన జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని దాదిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్రావు సుల్తాన్పూర్ లోని ఓ పరిశ్రమ లో విధులు నిర్వహించేందుకు బైక్పై వెళ్లాడు. శివాజీ స్టేడియం వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో నర్సింగారావు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై హనుమంతు తెలిపారు.