అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కార్పొరేట్ సెలూన్ షాపు ఎదుట నాయి బ్రాహ్మణులు ఆందోళన చేశారు. పట్టణంలోని మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న చీప్ అండ్ బెస్ట్ కార్పోరేట్ సెలూన్ తెరవరాదని మంగళవారం నాయి బ్రాహ్మణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సెలూన్ షాపు ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. కార్పొరేట్ సెలూన్ షాపు లు తెరవడంతో నాయి బ్రాహ్మణుల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వరాదని వారు డిమాండ్ చేశారు.