తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా శాసనసభ లాంజ్లో పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.