అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఐదున్నర గంటల సమయంలో డిప్యూటీ మేయర్ సాహితీ వాసంతి శాంతి సేన వినాయక ఉత్సవ సమితి 25వ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాంతి సేన వినాయక ఉత్సవ సమితి అధ్యక్షుడు పవన్ బంగి నాగ డిప్యూటీ మేయర్ సాహితి వాసంతి తదితరులు మాట్లాడుతూ శాంతి సేన సేవా వినాయక ఉత్సవ సమితి 25వ వార్షికోత్సవం నిర్వహించడం శుభ పరిణామం అదే విధంగా శాంతి సేన రక్తదాన సంస్థ ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి 20,000 మందికి పైగా రక్తదానం చేయడం అభినందినీయమని డిప్యూటీ మేయర్ సాహితీ వాసంతి భంగినాగా పవన్ తదితరులు పేర్కొన్నారు.