నల్గొండ జిల్లా, కనగల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం చండూరు సిఐ ఆదిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్గొండ పట్టణంలోని గొల్లగూడ కు చెందిన సముద్రాల కృష్ణ, ఉస్మాన్ పురకు చెందిన టిప్పు సుల్తాన్ అనే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్ళతో పాటు ట్రాక్టర్, లారీల బ్యాటరీల చోరికి పాల్పడుతున్నారని, ఈరోజు ఉదయం కనగల్ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వాహనాలు పోలీసులను చూసి వెనుకకు తిరగడంతో నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 20 బ్యాటరీలు, 24 వేల నగదు, ఒక మోటార్ సైకిల్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.