శ్రీశైల దేవస్థానం పరిధిలో సిబ్బంది నివసిస్తున్న పాత గృహాలను ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సోమవారం రెవెన్యూ సెక్షన్కు చెందిన అధికారి పెద్ద సత్రంలో నివసిస్తున్న వారికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా యువకులు దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండగా, అధికారి ఫోన్లు లాక్కోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులకు స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఉన్నతాదికారులు అక్కడికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు.