బాలికపై అత్యాచార కేసులో నల్గొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితునికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.35 వేల జరిమానా విధించింది. గురువారం మధ్యాహ్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 ఆగస్టు 31న చండూరు పిఎస్ పరిధిలో ఈ ఘటన జరగగా, బాధితురాలికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితునిపై అత్యాచారం చేస్తూ పాటు, మరో 2 సెక్షన్ల కింద మరో రెండేళ్ల జైలు శిక్షణ విధిస్తూ జిల్లా ఫోక్సొకోర్టు తీర్పునిచ్చింది. చాకచక్యంగా వ్యవహరించి సరైన సాక్షాదారాలు కోర్టుకు అందజేసి నిందితునికి శిక్ష పడే విధంగా కృషిచేసిన చండూరు పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.