సంగారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆదివారం తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘటన స్థలానికి ఎంఈఓ విద్యాసాగర్ చేరుకొని తరగతులు మూసివేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాఠశాలకు నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ వివరించారు.