శ్రీశైలం డ్యాంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో శనివారం రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించింది. చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ డీఎస్పీలు రంగబాబు, తిరుపతయ్య ఆధ్వర్యంలో 38 మందితో కూడుకున్న ఆక్టోపస్ టీమ్ ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. శ్రీశైలం జలాసం పై తీవ్రవాదుల నుంచి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఎలా స్పందించాలని విషయంపై ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్ నిర్వహించారు.