ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నరసింహస్వామి మెట్ల వీధిలో శుక్రవారం భారీ నాగుపాము ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ నివాసంలోని మెట్ల సమీపంలో ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించడంతో ఇంటి యజమాని భయభ్రాంతులకు గురై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని నాగుపామును చాకచక్యంగా స్పందించారు. పాములు నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. భారీ నాగుపామును బంధించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.