అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల నక్కపల్లి హోం మంత్రి అనిత కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం నాడు శ్రావణమాసంలో వచ్చే చివరి శుక్రవారం కావడంతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వరలక్ష్మి దేవి వ్రతాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి కూడా పాల్గొన్నారు. వరలక్ష్మి దేవి వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.