బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.ఎస్పి తుషార్ డూడీ సతీసమేతంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.ఎస్పీ డూడీ దంపతులు, కుటుంబ సభ్యులను పోలీస్ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు కుటుంబంతో ఈ వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. అదే సమయంలో పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అపశృతి దొర్లకుండా చూడాలని కోరారు.